
రోడ్డు ప్రమాదంలో గునుపూడి యువకుడి మృతి
నాతవరం:మండలంలో గునుపూడి గ్రామానికి చెందిన పైల కుశరాజు( 25) కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పైల అప్పలనాయుడు, బుజ్జమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. డిగ్రీ చదివిన పెద్ద కొడుకు కుశరాజు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓ ప్రైవేటు కంపెనీలో ఆరు నెలల కిందట ఉద్యోగంలో చేరాడు. గురువారం కుశరాజు వేరే వ్యక్తితో కలిసి బైక్‌పై వస్తుండగా వ్యాన్ ఢీకొనడంతో మృతి చెందాడు. చేతికందివచ్చిన కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు బోరు విలపిస్తున్నారు. గ్రామంలో అందరితో సరదగా ఉండే కుశరాజు మరణించడంతో స్నేహితులు రోదించారు. శుక్రవారం సమాచారం తెలిసిన వెంటనే కుటుంబు సభ్యులు సంఘటన స్థలానికి వెళ్లారు. కుశరాజుకు సోదరుడు, సోదరి ఉన్నారు. సోదరికి ఇటీవల వివాహం జరిగింది.