
పెద్దేరుకు వరద తాకిడి..300 క్యూసెక్కుల నీరు విడుదల
గేట్లు ద్వారా విడుదలవుతున్న నీరు
మాడుగుల రూరల్: బంగాళాఖాతంలో ఎర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు పెద్దేరు జలాశయంలో నీటి మట్టం పెరుగుతుంది. ఈ నేపధ్యంలో జలాయాశం గేట్ల ద్వారా శనివారం రాత్రి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పరిసరాల్లో 6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. కురుస్తున్న వర్షాలకు జలాశయం నీటిమట్టం 136.40 మీటర్లకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 137 మీటర్లు, వర్షాలకు జలాశయంలోకి 550 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుందని జలాశయం జేఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు. జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టంను దృష్టిలో పెట్టుకుని, నీటిని విడుదల చేస్తున్నట్టు, జలాశయం పరివాహక గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన ప్రజలకు విజ్జప్తి చేశారు.