
అటవీశాఖకు టేకు సిరులు
గొలుగొండ : గొలుగొండ కలప డిపో వల్ల అటవీశాఖకు మంచి ఆదాయం వస్తుంది. ప్రతి నెలా 6న జరిగే వేలం పాటలో టేకు అమ్మకాలు ఎక్కవగా జరుగుతుంటాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడా లేని విధంగా అమ్మకాలతో అటవీశాఖకు ఆదాయం సమకూరుతుంది. నాణ్యమైన టేకు చెట్లు ఇక్కడ ఉండడంతో వీటిని వేలం పాటలో దిక్కించుకోవడం కోసం వ్యాపారులు, ఇంటి అవసరాలకు వాడే యజమానులు జిల్లా నుండే కాకుండా ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు నుంచి రావడం జరుగుతుంది.
నాణ్యమైన టేకు చెట్లు లభ్యం
రాష్ట్రంలో ఎక్కడా లేని టేకు చెట్లు గొలుగొండ కలప డిపోలో లభ్యమవుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నల్లకొండ ప్లాంటేషన్‌లో ఉన్న టేకు చెట్లను అటవీశాఖ నరికించి ఇక్కడ డిపోకు తరలిస్తోంది. 1963 సంతవ్సరంలో టేకు ప్లాంటేషన్‌ను అప్పట్లో అటవీశాఖ వేయడం జరిగింది. సుమారుగా 300 ఎకరాల వరకు టేకు ప్లాంటేషన్ వేయగా గడిచిన 5 సంవత్సరాల నుంచి వీటిలో పెద్ద చెట్లను కటింగ్ చేయించి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది.
ప్రతి నెలా 6న వేలం
నల్లకొండ ప్లాంటేషన్ నుంచి నరికించిన టేకు చెట్లను వాహనాలపై ఇక్కడికి తీసుకువచ్చి వేలంలో అమ్మకాలకు ఉంచుతారు. చెట్లు లాటు నెంబర్, ఎన్ని అడుగులు అనే విషయం ముందుగా పాటదార్లకు చెబుతారు. వేలం పాటకు జిల్లా అటవీశాఖ అధికారి తప్పకుండా హాజరు కావడం డీఎఫ్‌వో ఆధ్వర్యంలో అమ్మకాలు చేస్తుంటారు. అటవీశాఖ అధికారి నిర్ణయించిన ధర కంటే ఎవరు ఎక్కువగా పాట పాడితే వారికి లాటులు అమ్మకాలు చేస్తుంటారు. ప్రతి నెలా 6న జరిగే కార్యక్రమంలో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తెలంగాణ ప్రాంతాల నుంచి ఎక్కువగా పాటదారులు హాజరవుతున్నారు.
రూ.కోటి వరకు ఆదాయం
గడిచిన ఏడాదిలో గొలుగొండ కలప డిపో పరిధిలో కోటి రూపాయల వరకూ టేకు అమ్మకాల ద్వారా అటవీశాఖకు ఆదాయం వచ్చింది. సుమారుగా 60 సంవత్సరాల వయస్సు గల చెట్లు వల్ల చెట్లు అంత్యంత సేవ తీరి ఉండడంతో ఈ చెట్లతో తయారు చేసే గృహోపకరణాలు ఎంతో నాణ్యతగా ఉంటాయి. అందుకే ఈ డిపోలో కలపకు అంత డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు తగ్గితే ప్లాంటేషన్‌లో చెట్లు నరికించే ఏర్పాట్లులో అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ అడుగు చెట్లు వెయ్యి నుంచి 5వేల వరకు ఉంటుంది. మన్యం అల్లూరి జిల్లాలో నల్లకొండ ప్లాంటేషన్ ఉన్నప్పటికీ మొదటి నుంచి ఈ కలప అనకాపల్లి జిల్లా గొలుగొండ కలప డిపోకు తరలిస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా రికార్డు స్థాయిలో గొలుగొండ కలప డిపో నుండి టేకు, వెదురు అమ్మకాలతో ఈ శాఖకు మంచి ఆదాయం వస్తోంది.

అటవీశాఖకు టేకు సిరులు