
ఉచిత బస్సుతో మహిళలకు ఆర్థిక ఆసరా
● హోం మంత్రి అనిత
● స్త్రీశక్తి పథకం ప్రారంభం
అనకాపల్లి టౌన్: ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజీ ఆవరణలో సీ్త్రశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆమె ప్రారంభించారు. బస్సులో ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన బస్సులో హోం మంత్రితోపాటు కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కొంతదూరం ప్రయాణించారు. జేసీ జాహ్నవి, జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి వి.ప్రవీణ, డీఎస్పీ శ్రావణి పాల్గొన్నారు.
నర్సీపట్నంలో..
నర్సీపట్నం: నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో సీ్త్రశక్తి పథకాన్ని డిపో మేనేజర్ ధీరజ్ శుక్రవారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, జెడ్పీటీసీ సుకల రమణమ్మ, ట్రాఫిక్ మేనేజర్ మోహన్‌రావు, కౌన్సిలర్లు చింతకాయల రాజేష్, శ్రీకాంత్, పాల్గొన్నారు.