
హరేకృష్ణ వైకుంఠంలో కృష్ణాష్టమి వేడుకలు
తగరపువలస: గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠం వద్ద హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ప్రారంభించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు నిష్కించిన భక్తదాస ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు బాల గోపాలునికి ఉయ్యాలసేవతో ఉత్సవాలు నిర్వహించారు. శ్రీరాధాకృష్ణుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. శనివారం శ్రీకృష్ణ భగవానునికి మహాభిషేకాలు, మహా మంగళ హారతి ఇవ్వనున్నారు. మిగిలిన రెండు రోజుల పాటు యథావిధిగా ఉయ్యాల సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించనున్నారు.