
కొలిక్కి రాని చర్చలు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని వాడనర్సాపురం వాసులకు నేవల్ బేస్ అధికారులకు గురువారం జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. పైడమ్మ చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయాలని ప్రయత్నిస్తున్న డీజీఎన్‌పీ సిబ్బందిని అడ్డుకుంటున్న స్థానికుల మధ్య నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న వాగ్వాదం సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించడంతో డీజీఎన్‌పీ సిబ్బంది వెనుదిరిగారు. తర్వాత వాడనర్సాపురం వాసులు తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా ఆయన అర్జెంట్ పని నిమిత్తం మాట్లాడి వెళ్లిపోయారు. తర్వాత మత్స్యకారులతో స్థానిక పోలీసు అధికారులు చర్చలు జరిపి శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే తమ గ్రామాన్ని తరలించాల్సి వస్తే అప్పుడు మాత్రమే చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవాలి తప్ప ప్రస్తుతం ఎటువంటి పనులు చేపట్టినా అడ్డుకుంటామని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని పేర్కొన్నారు.
అయితే గ్రామస్తులు కోరిన చోట ఫెన్సింగ్ వేయకుండా వదిలి మిగిలిన ప్రాంతాల్లో ఫెన్సింగ్ వేస్తామని నేవల్ అధికారులు చెప్పడం గమనార్హం.