
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో వేచలం విద్యార్థిని ఘనత
దేవరాపల్లి: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వేచలం హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని బొడబళ్ల చైతన్య సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ మేరకు బాపట్ల జిల్లా చీరాలలో ఇటీవల జరిగిన 36వ స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చైతన్య విశేష ప్రతిభ కనబరిచింది. అండర్–16 విభాగంలో పెంటాత్లీన్(60 మీటర్లు రన్నింగ్, 80 మీటర్లు హార్డిల్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, 600 మీటర్లు రన్నింగ్) సత్తా చాటి గోల్డ్ మెడల్‌ను కై వసం చేసుకుంది. సెప్టెంబర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. రాష్ట్ర స్థాయి పోటీలలో సత్తా చాటి గోల్డ్ మెడల్‌ను కై వసం చేసుకున్న విద్యార్ధిని చైతన్యను ఎంఈవో–1 సిహెచ్. ఉమ ఎంఈవో–2 వి.ఉషారాణి, ఇంచార్జ్ హెచ్‌ఎం పి. వెంకటరావు, స్థానిక ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో జరిగే జాతీయ స్థాయిలో పోటీలలో సైతం సత్తా చాటి మరిన్ని మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు.