
రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులతో పాఠశాల ఉపాధ్యాయులు
ఎస్.రాయవరం : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు పెదగమ్ములూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇరువురు ఎంపికై నట్టు వ్యాయామ ఉపాధ్యాయులు నిర్మల తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్పోర్ట్స్’ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన బాలికల విభాగం పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్టు చెప్పారు. పాఠశాలలో 10 వ తరగతి చదవుచున్న కనిగిరి హరిని,పోలిశెట్టి పావనిలు ఎంపికయ్యారన్నారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు సుధామాధురి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి స్నేహితులు ఈ విద్యార్థులను అభినందించారు. ఈ నెల 25వ తేదీన అమరావతి జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొని ఆడతారన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థులు ఎంపికకావడం పట్ల శిక్షణ ఇచ్చి వ్యాయామ ఉపాద్యాయురాలిని, ప్రతిభ క్రీడాకారులను అభినందించారు.