
గవర్నర్ విందుకు బాక్సింగ్ క్రీడాకారిణికి ఆహ్వానం
నర్సీపట్నం : బాక్సింగ్ క్రీడాకారిణి బొంతు మౌనిక కళ్యాణంకు గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. నర్సీపట్నంకు చెందిన మౌనికకు కలెక్టర్ ద్వారా రాజ్‌భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి లేఖ పంపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ సాయంత్రం గవర్నర్ బంగ్లాలో ప్రముఖులకు ఇచ్చే విందులో పాల్గొనాలని ఆ లేఖలో పేర్కొన్నారు. శాప్ బాక్సింగ్ సెంటర్‌లో ఐదేళ్ల నుంచి శిక్షణ పొందుతూ 10కి పైగా జాతీయ స్థాయి పోటీల్లో ఒక స్వర్ణ పతకం, 2 రజత, ఒక కాంస్య పతకం సాధించింది. 14 స్టేట్ లెవెల్ పోటీల్లో 8 స్వర్ణ, 2 రజత పతకాలు సాధించింది. గవర్నర్ బంగ్లా నుంచి ఆహ్వానం రావడంతో మౌనిక కళ్యాణంను పలువురు అభినందించారు.