
గవర్నర్ విందుకు క్రీడాకారుడు చరణ్‌కు ఆహ్వానం
కూర్మన్నపాలెం: వాలీబాల్ క్రీడాకారుడు అట్టాడ చరణ్‌కు గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. వడ్లపూడిలోని కణితి కాలనీలో నివాసముంటున్న చరణ్‌కు శ్రీకాకుళం కలెక్టర్ ద్వారా రాజ్‌భవన్ నుంచి గవర్నర్ కార్యదర్శి లేఖ పంపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ సాయంత్రం గవర్నర్ బంగ్లాలో ప్రముఖులకు ఇచ్చే విందులో పాల్గొనాలని ఆ లేఖలో పేర్కొన్నారు. చరణ్ తన మేనమామల వద్ద ఉంటూ.. విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో చరణ్ కాంస్య పతకం సాధించాడు. గవర్నర్ బంగ్లా నుంచి ఆహ్వానం రావడంతో చరణ్‌ను పలువురు అభినందించారు.