
ప్రైవేటు బస్సు బోల్తా
కశింకోట: నూతలగుంటపాలెం వద్ద బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రైవేటు బస్సు బోల్తా పడి ఎనిమిదిమంది గాయపడ్డారు. ఎస్‌ఐ పి.మనోజ్‌కుమార్ అందించిన వివరాలు.. ఒడిశా రాష్ట్రంలోని అడ్డుబంగి నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు.. ముందు వెళుతున్న వాహనాన్ని తిప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి నూతలగుంటపాలెం రిలయన్స్ బంక్ వద్ద రోడ్డు పక్కనున్న పల్లపు ప్రాంతంలోకి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భరతన్, కృష్ణారావు, పార్వతి, ఉమా, మాధవి, సనాతన రాయ్, పి.శ్రీరాములు, రాములమ్మ, బృందావతి, కె.మోహన్‌రావు గాయపడినవారిలో ఉన్నారు. ప్రమాదం జరిగే సరికి బస్సులో 37 మంది ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. సంఘటన స్థలాన్ని సీఐ అల్లు స్వామినాయుడు సందర్శించి, కేసు దర్యాప్తు చేపట్టారు.
ఎనిమిది మందికి గాయాలు

ప్రైవేటు బస్సు బోల్తా