పిడుగుపాటుకు పాడిగేదె మృతి
రావికమతం : రావికమతంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు పాడి గేదె మృతి చెందింది. కంఠంరెడ్డి నాయుడుకు చెందిన పాడిగేదె పాకలో ఉండగా సమీపంలో పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది. తన జీవనాధారం కోల్పోవడంతో నాయుడు కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
పిడుగుపడి పశువుల కాపరికి గాయాలు
నాతవరం : మండలంలో లింగంపేట పంచాయతీ శివారు బుచ్చెంపేట గ్రామానికి చెందిన బొడ్డు సూరిబాబు పిడుగుపాటుకు షాక్‌కు గురయ్యాడు, సూరిబాబు మంగళవారం పశువులను పొలంలోకి మేతకు తీసుకెళ్లాడు. భారీ వర్షం కురవడంతో సాయంత్రం పొద్దు పోయే సమయానికి ఇంటికి పశువులను తోలుకెళ్లడానికి సిద్ధపడుతున్నాడు. వర్షం తగ్గుముఖం పడుతుందని ఎదురుచూస్తుండగా సమీపంలో చెట్టుపై పిడుగుపడింది. ఈ పిడుగుపాటుకు సూరిబాబు షాక్ కొట్టి పడిపోయాడు. సమీపంలో ఉన్న స్థానికులు గుర్తించి సూరిబాబుకు సపర్యలు చేశారు. శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో వెంటనే 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు.


