నష్టాలివీ..
హార్మోన్ల అభివృద్ధికి చేపలకు ఇంజక్షన్లు చేసేవారు..కృత్రిమ పద్ధతిలో వివిధ రకాలైన కోటీ 25 లక్షల చేప పిల్లల్ని ఉత్పత్తి చేసేవారు..జిల్లాలోని అన్ని రిజర్వాయర్లకు సరఫరా చేయడమే కాక ప్రైవేట్ వ్యక్తులకు సైతం విక్రయించే వారు..మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కరమైన చేపల ఉత్పత్తి జరిగేది..కానీ ఇప్పుడు అదంతా గతం. కిందటి ఏడాది నుంచి ఈ ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపకపో వడం, నిధులు కేటాయించకపోవడంతో తాండవ రిజర్వాయరు వద్ద ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి తాళం వేశారు.
కేంద్ర నిధులతో వృద్ధాశ్రమం
కశింకోట మండలం జి.భీమవరంలోని వృద్ధాశ్రమాన్ని న్యూఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా శుక్రవారం ప్రారంభించనున్నారు.
శుక్రవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025
8లో
కూటమి నిర్లక్ష్యానికి నిదర్శనం
నేను సరుగుడు సర్పంచ్‌గా ఉన్నప్పుడు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం వైభవాన్ని దగ్గరుండి చూశాను. జిల్లా స్థాయి అధికారులు చేప పిల్లల ఉత్పత్తిని చూసేందుకు వస్తుండేవారు. మళ్లీ ఆ రోజులు రావాలంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. సిబ్బందిని నియమించాలి. ఈ సమస్యను వచ్చే మండల సర్వసభ్య సమావేశంలో చర్చిస్తాం.
– సాగిన లక్ష్మణమూర్తి, నాతవరం ఎంపీపీ
డిజిటల్ క్లాక్ డిజైన్‌కు
రూ.5 లక్షల నజరానా
తాటిచెట్లపాలెం (విశాఖ): రైల్వే స్టేషన్లలో సమయాన్ని చూపించే డిజిటల్ గడియారం డిజైన్ చేసేందుకు ఆసక్తి గల వారి నుంచి డిజైన్లను భారతీయ రైల్వే ఆహ్వానిస్తోంది. ఎంపిక చేసిన డిజైన్‌కు రూ. 5 లక్షల బహుమతి కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాల్తేర్ డివిజన్ అధికారులు ఒక ప్రకటన ద్వారా వివరాలు తెలిపారు. భారతీయ రైల్వే, దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్రదర్శించడానికి జాతీయ స్థాయిలో డిజిటల్ గడియారం డిజైన్ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీని మూడు విభాగాలుగా విభజించారు. నిపుణులు, కళాశాల/విశ్వవిద్యాలయ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు. ఈ మూడు విభాగాల నుంచి ఎంపిక చేసిన ఉత్తమ డిజైన్‌కు మొదటి బహుమతిగా రూ. 5 లక్షలు అందజేస్తారు. అలాగే ప్రతి విభాగం నుంచి ఐదుగురికి ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులు కూడా ఇవ్వనున్నారు. ఆసక్తి గలవారు తమ డిజైన్‌లను మే 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సమర్పించాలని రైల్వే అధికారులు తెలిపారు. ఎంట్రీలు అధిక రిజల్యూషన్‌లో ఉండాలి, వాటిపై వాటర్‌మార్క్‌లు, లోగోలు వంటివి ఏమీ ఉండకూడదు. అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జతచేయాలని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ) దిలీప్‌కుమార్ తెలిపారు. పాల్గొనేవారు ఎన్ని డిజైన్‌లనైనా పంపవచ్చు, అయితే ప్రతి డిజైన్‌కు సంబంధించిన వివరణ, దాని ఉద్దేశ్యం స్పష్టంగా ఉండాలని సూచించారు. పాఠశాల విభాగంలో ప్లస్ 2 వరకు చదివే విద్యార్థులు అర్హులు, వారు తమ పాఠశాల గుర్తింపు కార్డును కూడా అప్‌లోడ్ చేయాలి. కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా వారి ప్రస్తుత విద్యార్థి స్థితిని తెలిపే పత్రాలను అప్‌లోడ్ చేయాలని తెలిపారు.
నాతవరం: తాండవలో గల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి ఒకప్పుడు ఉత్తరాంధ్రలోనే ప్రత్యేక స్థానం ఉండేది. రిజర్వాయరు దిగువ ప్రాంతంలో 1984లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్–ఆగస్టు మధ్య కాలంలో కోటి 25 లక్షలు చేప పిల్లలను ఉత్పత్తి చేసేవారు. పెద్ద చేపల్లో హార్మోన్ల అభివృద్ధికి ఇంజక్షన్లు చేయడంతో వివిధ రకాలు చేప పిల్లల ఉత్పత్తి జరిగేది. ఆ పిల్లలను ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా మత్స్య సహకార సంఘాలకు సరఫరా చేసేవారు. మిగిలిన పిల్లలను జిల్లాలో ఉన్న రైవాడ, కల్యాణపులోవ, కోనాం, వరాహ, మేహాద్రిగెడ్డ, రావణాపల్లి రిజర్వాయర్లలో విడుదల చేసేవారు. చెరువుల్లో పెంచుకునేందుకు ప్రైవేటు వ్యక్తులకు కూడా విక్రయించేవారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన తాండవ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో గతేడాది నుంచి మచ్చుకై నా చేప పిల్లల్ని ఉత్పత్తి చేయడం లేదు. నిత్యం మత్స్య సహకార సంఘాల సభ్యులు, అధికారులతో కళకళలాడే ఉత్పత్తి కేంద్రంలో సిబ్బంది జాడే లేదు. ఎప్పుడు చూసినా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం మూసే ఉంటుంది. నీటి కోసం కేంద్రంలో ఏర్పాటు చేసిన బోరును ఉపయోగించకపోవడంతో పాడైంది. అడవిని తలపించేలా పెరిగిన పిచ్చి మొక్కలు బోరును కప్పేశాయి. గతంలో ఇక్కడ పని చేసిన కొంతమంది సిబ్బంది ఉద్యోగ విరమణ చేయగా మరికొందరు ఇతర ప్రదేశాలకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఈ కేంద్రం నర్సీపట్నం మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ విషయంపై నర్సీపట్నం మత్స్యకార అభివృద్ధి అధికారి నాగమణిని వివరణ కోరగా చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదన్నారు. గతంలో ఉండే సిబ్బంది ప్రస్తుతం లేరన్నారు. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన చేప పిల్లలను గత ఏడాది తాండవ రిజర్వాయరులో విడుదల చేశామన్నారు.
స్పీకర్ దృష్టి సారించాలి
తాండవలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం శిథిలావస్థలో ఉంది. కేంద్రంలో పిల్లల ఉత్పత్తి నిలిచిపోయింది. దీనిపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దృష్టి సారించాలి. రాజకీయాలకు అతీతంగా కేంద్రం పూర్వ వైభవం కోసం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే కలెక్టరుకు ఫిర్యాదు చేస్తాను.
–బాలేపల్లి వెంకటరమణ, సీపీఐ జిల్లా కార్యదర్శి
● చేప పిల్లల ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల తాండవ రిజర్వాయర్‌లో చేపల వేట తగ్గిపోయింది. దీంతో వేటపై ఆధారపడి జీవించే జాలరిపేటకు చెందిన మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.
● చేప పిల్లల ఉత్పత్తి లేకపోవడంతో సరకు తగ్గి ధర బాగా పెరిగింది. తాండవ బొచ్చు చేపకు భలే గిరాకీ ఉండేది. ఇక్కడ పెంచిన చేపలు ఎంతో రుచిగా ఉంటాయని పేరు. వినియోగదారులకు వివిధ రకాల నాణ్యమైన చేపలు అందకుండా పోయాయి.
● మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిపుణుల ఆధ్వర్యంలో చేపలను మనమే పెంచడం వల్ల ఆరోగ్యకరంగా ఉండేవి. విరివిగా లభించేవి. ఇప్పుడు ఆ అవకాశం లేదు.
న్యూస్‌రీల్
గతంలో ఏటా కోటి 25 లక్షలకు పైగా పిల్లల ఉత్పత్తి
ఉత్పత్తి కేంద్రం నిర్వహణ లేక శిథిలావస్థలో భవనాలు
నష్టాలివీ..
నష్టాలివీ..
నష్టాలివీ..
నష్టాలివీ..


