పచ్చని గిరులు.. పసిడి పరవళ్లు | - | Sakshi
Sakshi News home page

పచ్చని గిరులు.. పసిడి పరవళ్లు

Nov 28 2026 12:38 AM | Updated on Nov 28 2026 12:38 AM

డుంబ్రిగుడ: ప్రకృతి అందాలకు నిలయమైన అరకు లోని డుంబ్రిగుడ ప్రాంతం పూల సోయగాలతో పర్యాటకులను కట్టిపడేస్తోంది. చుట్టూ ఎత్తైన కొండలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. వాటి నడుమ నేలపై పచ్చని తివాచీ పరిచినట్లుగా విరబూసిన వలిసె పూలు.. మరోవైపు పసిడి వర్ణంలో మెరిసిపోతున్న పొద్దుతిరుగుడు పూల తోటల ప్రకృతి అందాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పూల అందాల నడుమ ఫొటోషూట్లు చేసుకునేందుకు, ప్రకృతి సోయగాలను కెమెరాల్లో బంధించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వివిధ షూటింగ్‌లకు సైతం ఈ ప్రాంతం ఆకర్షణీయమైన వేదికగా మారుతోంది. కొండల నడుమ పూల పరిమళాలు, రంగుల సందడి అరకు–డుంబ్రిగుడ ప్రాంతానికి మరింత అందాన్ని అద్దుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement