మన్యంలో వైఎస్సార్‌సీపీ హవా | - | Sakshi
Sakshi News home page

మన్యంలో వైఎస్సార్‌సీపీ హవా

Nov 28 2026 12:38 AM | Updated on Nov 28 2026 12:38 AM

పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ తన హవాను కొనసాగిస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో గిరిజనులు వైఎస్సార్‌సీపీ వెంటే నడుస్తున్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన హయాంలో గిరిజన ప్రాంతం కోసం, ఇక్కడి ప్రజల కోసం చేసిన సేవలు, మేలుతో పాటు గత 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్‌సీపీ హయాంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సుపరిపాలనను గిరిజనులు ఏ మాత్రం కూడా మర్చిపోలేదు. వారు చేసిన మంచికి కృతజ్ఞతగా వార్డు సభ్యుడి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి వరకు ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఆ పార్టీ మద్దతుదారులకే గిరిజనులు పట్టం కడుతున్నారు. ఇందుకు గాను ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జిల్లాలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా నిరూపితమైంది. జిల్లాలో ఏడు జెడ్పీటీసీలు, ఏడు ఎంపీపీలు, జెడ్పీ పీఠాన్ని దక్కించుకోగా ఈనెల 26న జరిగిన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 30 చోట్ల వైఎసార్‌సీపీ మద్దతుదారులే విజయం సాధించారు. కొయ్యూరు మండలంలో 33 చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉండగా ఒకచోట ముందుగానే వైఎస్సార్‌సీపీ నుంచి ఒకరు సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 32 చోట్ల ఎన్నికలు జరగగా14 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. చింతపల్లి మండలంలో 17చోట్ల ఎన్నికలు జరగగా తొమ్మిది చోట్ల, జీకే వీధిలో 16 చోట్ల ఎన్నికలు జరగగా ఏడుచోట్ల వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇక రెండు, మూడు విడతల ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించి రాష్ట్రంలో కూటమీ ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, అరాచకాలు, అవినీతిపై గిరిజనుల్లో అవగాహన కల్పించారు. ఆదివారం జరగనున్న మలి విడత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలవడం ఖాయమని జిల్లా వాసులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సింహభాగం వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల విజయం

రెండు, మూడు విడతాల్లో కూడా ఇదే హవా కొనసాగే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement