పాడేరుకు తరలించిన బ్యాలెట్‌, ఎన్నికల సామగ్రి | - | Sakshi
Sakshi News home page

పాడేరుకు తరలించిన బ్యాలెట్‌, ఎన్నికల సామగ్రి

Nov 28 2026 12:38 AM | Updated on Nov 28 2026 12:38 AM

కొయ్యూరు: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో బ్యాలెట్లను, ఇతర సామగ్రిని శుక్రవారం పాడేరు ట్రెజరీకి తరలించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంపీడీవో ప్రసాదరావు పంచాయతీల వారీగా పోస్టల్‌ బ్యాలెట్ల నుంచి ఓటర్లు వేసిన బ్యాలెట్లను వేరు చేశారు. అన్నింటిని ఒకసారి పరిశీలించి, సామగ్రిని పాడేరుకు తరలించారు. చింతపల్లి ట్రజరీలో భద్రరిచేందుకు అవసరమైన వసతులు లేకపోవడంతో పాడేరుకు తరలించారు.

నోటాకు 422 ఓట్లు

కొయ్యూరు: పంచాయతీ ఎన్నికల్లో 32 పంచాయతీల నుంచి 422 మంది నోటాకు ఓటు వేసినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 872 చెల్లని ఓట్లుగా పరిగణించారు. మొత్తం 32 పంచాయతీ ల నుంచి 28,908 ఓట్లు పోలైనట్టు, పోలింగ్‌ 68 శాతం జరిగినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement