ముంచంగిపుట్టు : పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా గత రెండు రోజులుగా ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా మండలంలోని 23 పంచాయతీల్లోని ఉద్యోగుల్లో ఎన్నికల విధుల్లో ఉన్న వారు తమ ఓటు హక్కును మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో శుక్రవారం పురుష ఉద్యోగులు–219, మహిళ ఉద్యోగులు–165 మంది పోస్టల్ బ్యాలెట్ వేశారు.ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఎంపీడీవో ధర్మారావు అన్ని ఏర్నాట్లు చేసి పర్యవేక్షించారు.


