పాయకరావుపేట : రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి చెందినట్టు తుని రైల్వే హెచ్‌సి పి.శ్రీనివాసరావు తెలిపారు. హౌరా నుంచి చెన్నె వెళ్లే మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి స్థానిక దుర్గాకాలనీ సమీపాన గల రైల్వే ట్రాక్ పక్కన ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మృతి చెందినట్టు తెలిపారు. మృతుని వద్ద ఏవిధమైన ఆధారాలు లేవని, సుమారు 35 సంవత్సరాలు వయస్సు ఉంటుందన్నారు. మృతుని వద్ద నున్న సెల్‌ఫోన్ ఆధారంగా అతని వివరాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపర్చడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సి తెలిపారు.


