భారీ వర్షంలోనూ ప్రచారం | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షంలోనూ ప్రచారం

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

సాక్షి, పాడేరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి అన్నారు. బుధవారం హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామంలో జెడ్పీటీసీ అభ్యర్థి ఒంటుబు ప్రియాంక, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతగిరి మండలంలోని పులుసుమామిడి, పెదబయలు గ్రామాల్లో బుధవారం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి దూరు జయవర్థిని, ఎంపీటీసీ అభ్యర్థి కౌసల్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గొడుగులు పట్టుకొని ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

ముంచంగిపుట్టు: భారీ వర్షంలోనూ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కించాయిపుట్టు పంచాయతీలో సీసా చిలకమ్మ గొడుగు పట్టుకొని ప్రచారం చేయగా, పెదగూడలో తమర్భ నాగరత్నం, బరడలో జనం ప్రమీల, సుజనకోటలో మజ్జి సుబ్బలక్ష్మి ఓటర్లను కలిశారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి 14 ఎంపీటీసీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

చింతపల్లి: జోరువానలోనూ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కాంతకుమారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు.మాజీ జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బూసరి కృష్ణ, పంచాయతీ యూత్‌ విభాగం అధ్యక్షుడు ఈశ్వరరావు, మండల యూత్‌ నాయకుడు చంటిబాబుపాల్గొన్నారు.

సీలేరు: స్థానిక ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రియకు మద్దతుగా మాజీ ఎంపీటీసీ సాంబమూర్తి. మాజీ సర్పంచ్‌ దుర్జో. మాజీ వైస్‌ సర్పంచ్‌ కారే శ్రీనివాస్‌, వల్లి ప్రసాద్‌ తదితరులు బుధవారం ప్రచారం నిర్వహించారు.

దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

కొయ్యూరు: భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మాజీ ఎంపీ, కొయ్యూరు జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొడ్డేడి మాధవి బుధవారం ప్రచారం నిర్వహించారు. బూదరాళ్ల పంచాయతీలో ఎంపీటీసీ అభ్యర్థి వంతల నారాయణతో కలిసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాజేంద్రపాలెంలో కోనె కన్నయ్య, మంప, రేవళ్లలో జర్త వీరమణితో కలిసి ప్రచారం చేశారు. కొయ్యూరు సెగ్మెంట్‌లో జర్త హేమకళ్యాణిని గెలిపించాలని పిలుపునిచ్చారు. గతంలో వైఎస్సార్‌సీపీ గిరిజన సంక్షేమానికి చేసిన పనులను, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు బేరీజు వేసుకోవాలని మాధవి అన్నారు. మాజీ ఎంపీపీ బడుగు రమేష్‌బాబు, మండల ఉపాధ్యక్షులు నర్సి కృష్ణ, కిరణ్‌, మాజీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు పాల్గొన్నారు.

పాడేరు: భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారాన్ని కొనసాగించారు. జడ్పీటీసీ అభ్యర్థి సీదరి రాంబాబుతో పాటు మండలంలోని 17 ఎంపీటీసీ సెగ్మెంట్ల అభ్యర్థులు బుధవారం తమ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాంబాబు వంట్లమామిడి సెగ్మెంట్‌లోని నందిగరువు, ఓనూరు, మోదాపల్లి పంచాయతీ పరిధిలోని గుర్రగరువులో పర్యటించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పాడేరు పట్టణంలో సెగ్మెంట్‌–1 అభ్యర్థి కిల్లు అనంతకుమారి, సెగ్మెంట్‌–2 అభ్యర్థి బోనంగి వెంకటరమణ, సెగ్మెంట్‌–3 అభ్యర్థి వర్తన పద్మ, సెగ్మెంట్‌–4 అభ్యర్థి కూడా సురేష్‌కుమార్‌ జోరువానలో ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement