చింతపల్లి ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

చింతపల్లి ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

చింతపల్లి: తుపాను నేపథ్యంలో నెలలు నిండిన గర్భిణులకు ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ లగుడు రాము సూచించారు. బుధవారం ఆయన చింతపల్లి ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని బర్త్‌ వెయిటింగ్‌ హాల్‌ను పరిశీలించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. తుపాను దృష్ట్యా నెలలు నిండిన గర్భిణులు ప్రసవానికి ముందుగానే ఆస్పత్రికి చేరుకుని వేచి ఉండేలా వెయిటింగ్‌ హాల్‌ను సిద్ధం చేయాలన్నారు. వైద్యుడు అందుబాటులో ఉండేలా చూడాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలవేణికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement