కోటవురట్ల : గొట్టివాడ– రామచంద్రపురం జంక్షన్ మధ్యలో సోమవారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుంకపూరుకు చెందిన పి.భార్గవ్ హెటిరో కంపెనీలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా నగరం నుంచి అడ్డురోడ్డు వైపు వెళుతున్న డి.నగేష్ ఎదురెదురుగా ఢీకొన్నారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో కోటవురట్లలోని సీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


