జెడ్పీ డిప్యూటీ సీఈవో సందీప్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ డిప్యూటీ సీఈవో సందీప్‌ బాధ్యతల స్వీకరణ

Oct 2 2026 12:34 AM | Updated on Oct 2 2026 12:34 AM

తుమ్మపాల : అనకాపల్లి జిల్లా పరిషత్‌ డిప్యూటీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (డిప్యూటీ సీఈఓ) ఈ.సందీప్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జెడ్పీ కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిబ్బందితో సమావేశమై జిల్లా అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రతి ఉద్యోగి సమన్వయంతో, బాధ్యతాయుతంగా, సమయపాలనతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు సక్రమంగా చేరేలా పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. సిబ్బంది సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమ ఏపీపీఆర్‌వోఎంఈ రాష్ట్ర అడ్హాక్‌ కమిటీ అధ్యక్షుడు ఎస్‌.సత్తిబాబు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్టిబాబు, పరిపాలనాధికారి పి.వి.వి.ఎన్‌. మూర్తి, ఏఓ అమ్మాజి తదితరులు పాల్గొని నూతన డిప్యూటీ సీఈఓకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement