చెట్టు తొలగింపు పనుల్లో ఆర్‌అండ్‌బీ ఇన్‌చార్జి ఈఈ శ్రీనివాస్, సిబ్బంది
సాక్షి,పాడేరు: పాడేరు–వడ్డాది ఘాట్‌రోడ్డులోని ఏనుగురాయి సమీపంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో భారీ వృక్షం నేలకూలింది. ఇరువైపులా సుమారు 2 గంటల పాటు ట్రాపిక్ నిలిచిపోయింది. పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు పోయే ప్రధాన రోడ్డు కావడంతో రవాణా స్తంభించింది. ఇరువైపులా ఆర్టీసీ బస్సులతో పాటు అన్ని వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అడవిలో కారుచీకటితో వారంతా భయాందోళన చెందారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఇన్‌చార్జి ఈఈ శ్రీనివాస్, ఇతర సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని చెట్టును తొలగించి, రాత్రి 8 గంటల సమయంలో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.


