అప్పన్నను దర్శించుకున్న ప్రముఖులు | - | Sakshi
Sakshi News home page

అప్పన్నను దర్శించుకున్న ప్రముఖులు

Sep 26 2026 12:56 AM | Updated on Sep 26 2026 12:56 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రేరా) సభ్యులు, పలు రాష్ట్రాల రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ ప్రాధికార సంస్థల చైర్‌పర్సన్లు, మాజీ ఎంపీ ప్రదీప్‌చంద్ర దేవ్‌, ప్రముఖ మణిపురి నృత్య కళాకారిణి పద్మశ్రీ దర్శన జవేరి, ప్రముఖ కూచిపూడి కళాకారిణి, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత అనుపమ మోహన్‌ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, అంతరాలయంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనం పొందారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement