నర్సీపట్నం: రాష్ట్ర స్థాయి వుషూ పోటీలకు నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కేఎస్‌ఆర్ స్పోర్ట్సు అకాడమీ ఆధ్వర్యంలో అనకాపల్లిలో బాల, బాలికల విభాగాల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 12 మంది స్వర్ణ, నలుగురు రజత పతకాలు సాధించారని వుషూ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. జిల్లా వుషూ క్రీడా అధ్యక్షుడు కే సత్యనారాయణ, కార్యదర్శి వెంకట్ బహుమతులు అందజేశారు. ఈ నెల 29, 30 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని కోచ్ అబ్బు తెలిపారు.


