యలమంచిలి రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని కొక్కిరాపల్లి హైవే కూడలి సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు.రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా రహదారిపై పడిన ఆ వ్యక్తిపై నుంచి పలు వాహనాలు ప్రయాణించడంతో శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.మృతుని చిరునామా,ఇతర వివరాలు తెలియలేదని, యాచకుడు కావచ్చని భావిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కొక్కిరాపల్లి వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.


