అమర్‌నాథ్‌ హెచ్చరికతో దిగొచ్చిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్‌ హెచ్చరికతో దిగొచ్చిన ప్రభుత్వం

Sep 26 2026 12:56 AM | Updated on Sep 26 2026 12:56 AM

రోలుగుంట: గోవాడ చక్కెర కర్మాగారం చెరకు రైతుల బకాయిలు, ఫ్యాక్టరీ నిర్వహణపై ఈ నెల 28న గోవాడలో మహాజన సభ నిర్వహించనున్నామని చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరికతో చంద్రబాబు ప్రభుత్వం దిగిరావడం హర్షణీయమని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రతినిధి పోతల లక్ష్మీశ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు, పార్టీ మండలాధ్యక్షుడు టి.వి.రమణ తెలిపారు. శుక్రవారం రోలుగుంటలో వారు మాట్లాడుతూ అప్పుల్లో కూరుకుపోయిన గోవాడ సుగర్స్‌ ఫ్యాక్టరీని నడిపించేందుకు గత వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి మంత్రి అమర్‌నాథ్‌ చొరవ తీసుకుని రూ. 87 కోట్లు మంజూరు చేయించారన్నారు. రైతు పక్షపాతి మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సైతం చెరకు రైతుకు ప్రతి రూపాయి చెల్లిస్తే, సీఎం చంద్రబాబు మాత్రం గతేడాది చెరకు సరఫరా చేసిన రైతులకు 18 నెలలు పైబడి రూ. 25 కోట్లు, ఉద్యోగులకు రూ. 5 కోట్లు వెరసి రూ. 30 కోట్లు బకాయిలు చెల్లించలేదన్నారు. వీటిపై ఈ నెల 9న రోలుగుంటలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని, లేకుంటే ఈ నెల 28న మహాజన సభ గోవాడలో తానే నిర్వహిస్తానని, ఆ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారన్నారు. ఆ మాదిరిగానే సభ నిర్వహణపై అన్ని ఏర్పాట్లు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి బకాయిలు చెల్లించేందుకు సన్నద్ధమవడం, ఇది కేవలం అమర్‌నాథ్‌ సంకల్పంతోనేనని ప్రశంసించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పోతల లక్ష్మీరమణమ్మ, యవజన విభాగం అధ్యక్షుడు వడ్డాది సతీష్‌, చెట్టుపల్లి వెంకట్రావు, కుంచంగి హరిబాబు, కాళ్ల నాయుడుబాబు పాల్గొన్నారు.

గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ

రైతుల బకాయి చెల్లింపునకు సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement