39 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

39 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌

Sep 26 2026 12:56 AM | Updated on Sep 26 2026 12:56 AM

తుమ్మపాల: జిల్లాలో 2026–27 సంవత్సరానికి 39 మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు జిల్లా ఎకై ్సజ్‌ అధికారి సుధీర్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా ఎకై ్సజ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 155 మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయని, వాటి కాలపరిమితి ఈ నెల 30తో ముగియనుందని చెప్పారు. వీటిలో 140 ఓపెన్‌ కేటగిరీ, 15 గీత కులాలకు కేటాయించిన దుకాణాలు ఉన్నాయన్నారు. అక్టోబర్‌ 1 నుంచి 2027 సెప్టెంబరు 30 వరకు దుకాణాలను రెన్యువల్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. ఈ నెల 23తో రెన్యువల్‌ గడువు ముగిసిందని, 122 దుకాణదారులు రెన్యువల్‌ చేసుకున్నారని తెలిపారు. వీటిలో 107 ఓపెన్‌ కేటగిరీ దుకాణాలు, 15 గీత కులాలకు కేటాయించిన దుకాణాలు ఉన్నాయన్నారు. రెన్యువల్‌ చేసుకోని 33 ఓపెన్‌ కేటగిరీ దుకాణాలతో పాటు గత లీజు సంవత్సరంలో సరెండర్‌ చేసిన, రద్దయిన మరో ఆరు ఓపెన్‌ కేటగిరీ దుకాణాలు కలిపి మొత్తం 39 షాపులకు కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేశామన్నారు. ఈ దుకాణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, అక్టోబరు 1న అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు అధికారిక ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబరు 5న ఉదయం 8 గంటలకు అనకాపల్లి గుండాల జంక్షన్‌లోని ఎస్‌.ఆర్‌. శంకరన్‌ మీటింగ్‌ కాంప్లెక్స్‌లో లాటరీ నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నట్టు వెల్లడించారు.

అక్టోబర్‌ 1 వరకు ఆన్‌లైన్‌లో

దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement