క్రెబ్స్‌ బయో పరిశ్రమను తెరిపించండి | - | Sakshi
Sakshi News home page

క్రెబ్స్‌ బయో పరిశ్రమను తెరిపించండి

Sep 25 2026 1:05 AM | Updated on Sep 25 2026 1:05 AM

● కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు కార్మిక నాయకుల వినతి

కశింకోట : మండలంలోని కొత్తపల్లి వద్ద ఉన్న క్రెబ్స్‌ బయో కెమికల్‌ పరిశ్రమను తెరిపించడానికి చర్యలు తీసుకోవాలని పరిశ్రమ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయు అనుబంధం) అధ్యక్షుడు అప్పారావు, ప్రధాన కార్యదర్శి బాబూరావు కోరారు. సీఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌. నరసింగరావు ఆధ్వర్యంలో విజయవాడలోని కాలుష్య నియంత్రణ మండలి కమిషనర్‌ను గురువారం కలిసి వినతి పత్రం అందజేసి కోరినట్టు వారు తెలిపారు. ఏడాదిన్నరగా కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలతో పరిశ్రమను మూసివేశారని, దీనివల్ల 330 మంది కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామని ప్రచార ఆర్భాటం చేస్తుందని, అయితే ఉన్న పరిశ్రమలను మాత్రం తెరిపించేందుకు చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే క్రెబ్స్‌ పరిశ్రమను తెరిపించి తమ ఇబ్బందులు తొలగించాలని కోరారు. యూనియన్‌ ప్రతినిధులు కన్నబాబు, జి. శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement