67 ఏళ్ల విశాఖ జెడ్పీ ప్రస్థానానికి ముగింపు | - | Sakshi
Sakshi News home page

67 ఏళ్ల విశాఖ జెడ్పీ ప్రస్థానానికి ముగింపు

Sep 25 2026 1:05 AM | Updated on Sep 25 2026 1:05 AM

నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన

మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌ ప్రస్థానంలో ఒక అధ్యాయం ముగిసింది. జె.సుభద్ర అధ్యక్షతన కొనసాగిన జెడ్పీ పాలకవర్గం గడువు గురువారంతో పూర్తయింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన విశాఖ జెడ్పీ స్వరూపం మారిపోనుంది. శుక్రవారం నుంచి కొత్త జిల్లాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌కు దాదాపు 67 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. దీని పరిధిలో మొత్తం 39 మండలాలు ఉండగా.. జిల్లాల విభజన తర్వాత విశాఖపట్నం జిల్లాకు 4, అనకాపల్లికి 24, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 11 మండలాలు కేటాయించారు. 2021 సెప్టెంబర్‌ 25న బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం గడువు తీరడంతో ఉమ్మడి జెడ్పీ పేరు కనుమరుగవుతోంది. గడువు ముగిసిన నేపథ్యంలో జెడ్పీల పాలనకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌, అనకాపల్లి జిల్లాకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌, అల్లూరి సీతారామరాజు జిల్లాకు కలెక్టర్‌ పి.నిశాంతిలు బాధ్యతలు చేపట్టనున్నారు. అధికారులతో పాటు అవసరమైన సిబ్బంది కేటాయింపులు కూడా పూర్తయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement