యుద్ధప్రాతిపదికన కల్వర్టు పునరుద్ధరణ పనులు | - | Sakshi
Sakshi News home page

యుద్ధప్రాతిపదికన కల్వర్టు పునరుద్ధరణ పనులు

Sep 25 2026 1:05 AM | Updated on Sep 25 2026 1:05 AM

జి.మాడుగుల: వరద ఉధృతికి జాతీయ రహదారిలోని సంగం ప్రాంతంలో కొట్టుకుపోయిన తాత్కాలిక పైపు కల్వర్టును పునరుద్ధరించే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పాడేరు–జి.మాడుగుల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో పైపు కల్వర్టు నిర్మాణ పనుల్లో జాతీయ రహదారి విభాగం అధికారులు నిమగ్నమయ్యారు. ఈ పనులను తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ సాయిరామ్‌పడాల్‌, ఎన్‌హెచ్‌ జేఈఈ లోకేష్‌ పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం నాటికి ఈ రోడ్డులో వాహనాల రాకపోకలు సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. కల్వర్టు పునరుద్ధరణ పనులను వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన పనులు వేగవంతం చేయాలని ఆయన అధికారులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement