గంటపాటు నిలిచిన రాకపోకలు
గూడెంకొత్తవీధి: వర్ష బీభత్సానికి గూడెంకొత్తవీధి మండలం పెదవలస జాతీయ రహదారి ఘాట్ రోడ్డులో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున బండరాళ్లతో పాటు భారీ చెట్టు రోడ్డుపైకి నేలకూలడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు సుమారు గంటపాటు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సుమారు గంటపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న సమీప గ్రామాలైన చాపరాతిపాలెం, పెదవలస ప్రజలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి కొండచరియలను, చెట్టును పక్కకు తొలగించారు. దీంతో రాకపోకలు పునరుద్ధరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


