చోడవరం : స్థానిక శ్రీ కేశవస్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయంలో శ్రీదేవిభూదేవి సమేతుడైన శ్రీ కేశవస్వామివారి విగ్రహాలపై ఉన్న బంగారు, వెండి ఆభరణలు దొంగలించుకుపోయారు. ఆలయం ప్రధాన ద్వారం గేటు తాళాలు పగలు గొట్టి ఆలయంలోకి దొంగలు ప్రవేశించారు. అమ్మవారి మెడలో ఉన్న బంగారు శతమానాలతోపాటు సుమారు 500 గ్రామాలు విలువైన వెండి ఆభరణాలు, పూజా సామాగ్రిని చోరీ చేశారు. అయితే హుండీ జోలికి వెళ్లలేదు. ఈ హుండీ చాలా యేళ్లుగా తెరవకపోవడంతో సుమారు రూ. 80వేలకు పైబడి హుండీలో డబ్బులు ఉన్నట్టు పోలీసులు పరిశీలనతో తేలింది. దొంగలు ఆలయంలోకి చొరబడి గర్భాలయంలో ఉన్న 3గ్రాముల బంగారు శతమానాలు, 500 గ్రామాలు వెండి ఆభరణలు దొంగలించుకుపోయినట్టు చోడవరం సీఐ అప్పలరాజు తెలిపారు. డాగ్‌స్క్వాడ్, పోలీసు బృందాలు వచ్చి ఆలయాన్ని పరిశీలించారు. దొంగలు కోసం వెతుకుతున్నామని సీఐ తెలిపారు.


