ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద 11వ జాతీయ ఆయుర్వేద వేడుకలు నిర్వహిస్తున్న లావణ్య
అనకాపల్లి : జిల్లా ఆయూష్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో 11వ జాతీయ ఆయుర్వేద వేడుకలు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఆయూష్ విభాగం అధికారి కె.లావణ్య, డీసీహెచ్‌ఎస్ పి.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండ్ రవికుమార్ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం పూర్వీకుల నుంచి ఉందని, ఇంగ్లిస్ మందులు ద్వారా రోగి వ్యాధిని ఏవిధంగా నివారించవచ్చో ఆయుర్వేదంలో అదేవిధంగా నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద ఆస్పత్రి సిబ్బంది సీ.గణేష్, జిల్లా ప్రొగ్రామ్ కన్వీనర్ బి.మమతా, యోగా శిక్షకులు బి.అప్పారావు, ఎం.చంద్రిక పాల్గొన్నారు.


