మహాజనసభ పోస్టర్ల విడుదల | - | Sakshi
Sakshi News home page

మహాజనసభ పోస్టర్ల విడుదల

Sep 24 2026 1:36 AM | Updated on Sep 24 2026 1:36 AM

చోడవరం: గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ మహాజనసభను వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా మహాజనసభ ప్రచార వాల్‌ పోస్టర్లను ఎక్కడికక్కడ ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించి, రైతులకు పంపిణీ చేస్తున్నారు. చోడవరం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వాల్‌పోస్టర్లను ఆ పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ సంయుక్త కార్యదర్శి పల్లా నర్సింగరావు, జిల్లా యూత్‌ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్‌, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, మాజీ జెడ్పీటీసీ బొడ్డేడ సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి దొడ్డి వెంకట్రావు బుధవారం ఆవిష్కరించారు. చెరకు రైతులను టీడీపీ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, ఫ్యాక్టరీ మహాజనసభను నిర్వహించలేదని, రైతులకు చెరకు బకాయిలు రెండేళ్లుగా చెల్లించలేదని వారు ధ్వజమెత్తారు. అందుకే రైతులు, కార్మికుల తరపున పోరాటం చేసేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైందన్నారు. ఈ నెల 28న జరగనున్న సభ్య చెరకు రైతుల మహాజన సభను రైతులంతా విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement