తారువలో గణపతికి 50 కేజీల లడ్డూను సమర్పించి పూజలు చేస్తున్న మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు
దేవరాపల్లి : వినాయక నవరాత్రి మహోత్సవాలలో మండలంలోని తారువలో గణపయ్యకు 50 కేజీల భారీ లడ్డూను మాజీ డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు చేతుల మీదుగా బుధవారం సమర్పించారు. స్థానిక మర్లమాంబ యూత్, స్థానిక ప్రజలు సమకూర్చిన ఈ లడ్డూను వినాయకుని వద్ద ఉంచి మాజీ డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వినాయక నిమజ్జనం రోజున ఈ లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నట్లు స్థానిక యూత్ కమిటీ సభ్యులు తెలిపారు. ఐక్యతగా వినాయక నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్న స్థానిక యూత్‌ను మాజీ డిప్యూటీ సిఎం ముత్యాలనాయుడు ప్రత్యేకంగా అభినందించారు.


