సింహగిరిపై కొనసాగుతున్న పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

సింహగిరిపై కొనసాగుతున్న పవిత్రోత్సవాలు

Sep 23 2026 12:31 AM | Updated on Sep 23 2026 12:31 AM

సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం హోమాలు, పవిత్ర ప్రతిష్ట పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి,భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో కొలువుదీర్చి శాంతిపఠనం, యాగశాలార్చన, కుంభావాహనం, పవిత్రాధివాసం, చక్రాబ్జమండలరచనం, ఆవాహనం, పవిత్రప్రతిష్ట జరిపించారు. సాయంత్రం 5గంటల నుంచి ఆలయ బేడామండపంలో తిరువీధి, రాత్రి విశేష హోమాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఉప ప్రధానార్చకుడు కె.కె.ప్రసాదాచార్యులు, అర్చకులు, పారాయణదారులు, వేద పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement