విద్యార్ధిని మౌనికను అభినందిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు
నర్సీపట్నం : ఇటీవల కర్ణాటకలో జరిగిన బాక్సింగ్ సౌత్ ఇండియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2026 పోటీల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతున్న బొంతు మౌనిక బ్రాంజ్ మెడల్ సాధించింది. ఆ విద్యార్థినితో పాటు ఫిజికల్ డైరెక్టర్ రెడ్డి శ్రీనివాస్‌ను మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు అభినందించారు. బాక్సింగ్‌లో మరింత రాణించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ అకాంక్షించారు.


