బ్యాటరీ కారు కొనుగోలుకు రూ.7 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

బ్యాటరీ కారు కొనుగోలుకు రూ.7 లక్షల విరాళం

Sep 23 2026 12:31 AM | Updated on Sep 23 2026 12:31 AM

ఈవో వెంకటరావు చెక్కు అందిస్తున్న దాత నడింపల్లి వెంకట రామకృష్ణరాజు

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనార్థం సింహగిరికి వచ్చే దివ్యాంగుల సౌకర్యార్థం బ్యాటరీ కారు కొనుగోలుకు రూ.7 లక్షల విరాళాన్ని హైదరాబాద్‌కి చెందిన నడింపల్లి వెంకట రామకృష్ణరాజు(జలవిహార్‌ రాజు) మంగళవారం అందించారు. సింహగిరికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన సంబంధిత విరాళ చెక్కును ఆలయంలో దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావుకి అందజేశారు. దేవస్థానం తరఫున దాతకు స్వామివారి దర్శనం కల్పించి ప్రసాదం, శేషవస్త్రంలను ఈవో అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement