నేత్ర పర్వంగా మృగవేట | - | Sakshi
Sakshi News home page

నేత్ర పర్వంగా మృగవేట

Sep 23 2026 12:31 AM | Updated on Sep 23 2026 12:31 AM

నక్కపల్లి : ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మృగవేట కార్యక్రమం నేత్ర పర్వంగా జరిగింది. ఉదయం కొండపై కల్కి అవతారంలో వెలసిన స్వామివారికి పంచామృతాభిషేకం, నిత్యార్చనలు పూర్తిచేసి భక్తులకు దర్శనం కల్పించారు. కొండ దిగువ క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామి, ఆండాళ్ల మ్మవారి సన్నిధిలో నిత్యపూజలు చేసిన అనంతరం పల్లకిలో సుదర్శన పెరుమాళ్లను ఉంచి గ్రామ బలిహరణలు పూర్తి చేశారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు, తీర్థగోష్టి, ప్రసాద వినియోగం జరిగింది. సాయంకాలారాధనలో ప్రత్యేక హోమాలు నిర్వహించిన తర్వాత గ్రామ బలిహరణలు పూర్తి చేశారు. సాయంత్రం శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామిని గజవాహనంలో వేంచేయింపజేసి బందుర సరస్సు వద్ద ఉన్న లంకవారి మండపం వద్దకు తీసుకెళ్లి మృగవేట కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. వర్షం కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆలయంలోనే నిర్వహించారు. తర్వాత నీరాజన మంత్రపుష్పములు తీర్థగోష్టి, అనంతరం ప్రసాద వినియోగం జరిగింది. గ్రామ తిరువీథి సేవ జరిగింది. ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్‌, అర్చక స్వాములు, సంకర్షణపల్లి రాజగోపాల కృష్ణమాచార్యులు, పీసపాటి వెంకటశేషాచార్యులు భాగవతం గోపాలాచార్యులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement