నక్కపల్లి: రాజయ్యపేటకు చెందిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చొక్కా కాశీ మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. నక్కపల్లి పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, మండల శాఖ అధ్యక్షుడు గొర్ల గోవిందరావు అతనికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. త్వరలో జరగనున్న రాజయ్యపేట మత్స్యకార సొసైటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున కాశీ పోటీచేస్తారని వారు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా గ్రామ పెద్ద పిక్కి నాగరాజును పార్టీ తరపున నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు ఆశీస్సులతో ఎంపిక చేశామన్నారు. గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు కాశీ, నాగరాజులకు మద్దతు ప్రకటించాలన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరిన కాశీ, నాగరాజులను మత్స్యకార సొసైటీ అధ్యక్ష ఉపాధ్యక్షులుగా గెలిపించాలని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి కోరారు. పార్టీలో చేరిన కాశీని అభినందించారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మైలపల్లి బాబ్జి, మైలపల్లి సూరిబాబు, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు, పిక్కి నూకరాజు, మండల కార్యదర్శి ఎరిపల్లి నాగేశు, యజ్జల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


