స్కేటింగ్‌లో డావెన్సీ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

స్కేటింగ్‌లో డావెన్సీ విద్యార్థుల ప్రతిభ

Sep 23 2026 12:31 AM | Updated on Sep 23 2026 12:31 AM

● జిల్లా స్థాయిలో 2 స్వర్ణ, 3 కాంస్య పతకాలు కై వసం

● జిల్లా స్థాయిలో 2 స్వర్ణ, 3 కాంస్య పతకాలు కై వసం

స్కేటింగ్‌లో సత్తా చాటిన డావెన్సీ పాఠశాల విద్యార్థులు

మునగపాక : తిమ్మరాజుపేట డావెన్సీ అంతర్జాతీయ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి స్కేటింగ్‌లో సత్తా చాటారు. విశాఖపట్నంలోని గోపాలపట్నంలో అల్వార్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ నిర్వహించిన 2026–27 ఫెస్ట్‌లో భాగంగా జరిగిన జిల్లా స్థాయి స్కేటింగ్‌ పోటీల్లో 2 స్వర్ణ , 3 కాంస్య పతకాలు సాధించారు. బి.రిషికేష్‌ నాయుడు ఒక నిమిషం రేసు , 20 సెకెండ్ల రేసులో రెండు బంగారు పతకాలు సాధించారు. అలాగే కాండ్రేగుల విన్మయీశ్రీ ఒక నిమిషం రేసులో కాంస్య పతకం, వి.తేజ రిత్విక్‌ 1 నిమిషం రేసుతో పాటు 20 సెకెండ్ల రేసులో కాంస్య పతకం సాధించారు. దీంతో మంగళవారం స్కూల్లో ఆయా విద్యార్థులను మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుందరయ్య, డైరెక్టర్‌ రమణాజీ, డీన్‌ దీప, ప్రిన్సిపాల్‌ రమేష్‌, కోచ్‌ రమేష్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement