అధికార యంత్రాంగం అప్రమత్తం: కలెక్టర్‌ నిశాంతి | - | Sakshi
Sakshi News home page

అధికార యంత్రాంగం అప్రమత్తం: కలెక్టర్‌ నిశాంతి

Sep 23 2026 12:31 AM | Updated on Sep 23 2026 12:31 AM

తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ అమలు చేస్తున్నామని, అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ టి.నిశాంతి మంగళవారం అధికారులను ఆదేశించారు. తుపాను ముందస్తు జాగ్రత్తలపై ఆమె అన్ని మండలాల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా గెడ్డల్లో వరదనీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున అధికారులు తగిన నివారణ చర్యల్లో నిమగ్నమవ్వాలని స్పష్టం చేశారు. 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షించాలని, పోలీసు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది విధుల్లోనే ఉండాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రమాదకర వాగులు, జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

● రోడ్లు, కల్వర్టులు దెబ్బతింటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖల అధికారులను అప్రమత్తం చేశారు.

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రాథమిక పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. రెసిడెన్సియల్‌ పాఠశాలల విద్యార్థులు మాత్రం పాఠశాలల ప్రాంగణాలు దాటి వెలుపలకు వెళ్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి, గిరిజన సంక్షేమ శాఖ డీడీని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement