చింతపల్లి ఏడీఆర్ ఆదిలక్ష్మి
చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ డి. ఆదిలక్ష్మి మంగళవారం తెలిపారు. ఈ నెల 23 నుంచి 27 వరకు అల్లూరి జిల్లా పరిధిలోని వాతావరణ వివరాలను ఆమె వెల్లడించారు. చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో 10 నుంచి 53 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ణ ఉష్ణోగ్రతలు 22.5నిసెంటీగ్రేడ్ నుంచి 22.9 సెంటీగ్రేడ్ మధ్య, కనిష్ణ ఉష్ణోగ్రతలు 20.3ని సెంటీగ్రేడ్ నుంచి 21.0 సెంటీగ్రేడ్ మధ్య ఉండవచ్చన్నారు. గాలిలో సాపేక్ష తేమ శాతం ఉదయం వేళల్లో 92 నుంచి 93 , మధ్యాహ్న సమయాల్లో 90 నుంచి 95 శాతం మధ్య నమోదు అవుతుందన్నారు. గాలి గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్ సూచించారు.


