వైఎస్సార్‌సీపీలో టీడీపీ కార్యకర్తల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో టీడీపీ కార్యకర్తల చేరిక

Sep 22 2026 12:36 AM | Updated on Sep 22 2026 12:36 AM

పాడేరు: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పాడేరు నియోజకవర్గంలోని జీకే వీధి మండలం వంచుల పంచాయతీ ఎల్లవరం, వంచుల అద్దెరివీధి గ్రామాలకు చెందిన టీడీపీ సీనియర్‌ కార్యకర్తలు గెమ్మెలి పండన్న, గెమ్మెలి గున్నమ్మ, కంకిపాటి బాలరాజుతో సహా సుమారు 30 మంది కార్యకర్తలు సోమవారం పాడేరు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లుగా గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం, పార్టీ పటిష్టత కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. కూటమి పార్టీల మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతిపై గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement