దుర్గా నవరాత్రి ఉత్సవాలకు కమిటీల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

దుర్గా నవరాత్రి ఉత్సవాలకు కమిటీల ఏర్పాటు

Sep 22 2026 12:36 AM | Updated on Sep 22 2026 12:36 AM

సాక్షి, పాడేరు: స్థానిక గిరికై లాస క్షేత్రంలోని రాజరాజేశ్వరి ఆలయం వద్ద అక్టోబర్‌ 11వతేదీ నుంచి 20వతేదీ వరకు విజయదశమి నవరాత్రులను నిర్వహించనున్నట్టు ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా కొమ్మోజు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శులుగా కొట్టగుళ్లి రామారావు, యాదగిరి శ్రీనివాసరావు, కార్యదర్శిగా కిముడు ప్రభాకర్‌, ఉపాధ్యక్షుడిగా కొట్టగుళ్లి పోతురాజు, కోశాధికారులుగా కోనే శివ, దాసరి నాగు, సలహాదారులుగా ఉడా త్రినాథ్‌, వంతెన్బ రాజబాబు, దేసిది బాబూరావు, పలాస బాలన్న, కూడా సురేష్‌కుమార్‌, ముకుందరావు, కె.రమేష్‌నాయుడు, కొట్టగుళ్లి చిట్టినాయుడు ఎంపికయ్యారని ఆయన తెలిపారు. మహిళా కమిటీ అధ్యక్షురాలిగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా కె.జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా దాసరి ఈశ్వరమ్మ, కార్యదర్శులుగా కె.వసంతకుమారి, కించేయి జ్యోతి, సహాయ కార్యదర్శులు,సలహాదారులుగా కొట్టగుళ్లి రమాదేవి, కిముడు కాత్యాయిని, వి.గాయత్రిదేవి, భాగ్యలక్ష్మి, వైదేహి, నిర్మల, సత్యవతితో పాటు పలువురు సభ్యులుగా ఎంపికయ్యారని తెలిపారు. ఈరెండు కమిటీల ఆధ్వర్యంలో దసరా నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement