సాక్షి,పాడేరు: జిల్లాలోని రెవెన్యూ విభాగాల్లో ప్రజా సేవలను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణిశ్రీపూజ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమ వారం రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాఖాపరమైన పనులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని,సిబ్బంది పనితీరుమెరుగుపడాల న్నా రు. భూముల రీసర్వే ప్రక్రియతో పాటు భూ రికార్డుల ప్రక్షాళనను వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, ఓటర్ల జాబితాల సవరణలతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ, మెజిస్టీరియల్ విచారణ రికార్డుల విధులను సమర్థంగా నిర్వహించాలన్నారు. ఈ–గవర్నెస్, సీఎం రిలీఫ్‌ఫండ్ సేవలను మరింత సులభతరం చేయాలని సూచించారు. ఆర్‌ఆర్‌యాక్ట్ కింద బకాయిల వసూళ్లు, పీజీఆర్‌ఎస్ అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సెక్షన్ సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌వో లోకేశ్వరరావు,సర్వేఏడీఈశ్వరదొరతదితరులుపాల్గొన్నారు.


