పెట్రోల్‌ బంకుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ

Sep 22 2026 12:36 AM | Updated on Sep 22 2026 12:36 AM

ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ వెల్లడి

పాడేరు: పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనంతగిరి, ముంచంగిపుట్టు, కొయ్యూరు మండలాల్లోని హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంకుల నిర్వహణకు ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ సోమవారం తెలిపారు. జిల్లా పరిధిలోని డిగ్రీ అర్హత కలిగిన స్థానిక గిరిజన గిరిజన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. లాటరీ తీసి ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న లీజుదారులు పెట్రోల్‌ బంకు నిర్వహణకు పూర్తి పెట్టుబడి పెట్టాలని తెలిపారు. ఐటీడీఏకు పెట్రోల్‌ బంకు అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఐటీడీఏ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పేరిట దరఖాస్తు ఫీజు రూ.5 వేల నగదుతో పాటు రూ.లక్ష డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లాటరీ ద్వారా ఎంపిక కాని అభ్యర్థులకు రూ.లక్ష డీడీ తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఆసక్తి గల గిరిజన అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్‌ 1వ తేదీ ఉదయం 11 గంటలకు పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో లాటరీ నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9440972048 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement