అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 75 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట పరిధిలో ఉన్న సమస్యలు త్వరితగతిన పరిష్కరానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
భూ తగాదాలు, ఆస్తి గొడవలు, ఆర్థిక మోసాలు, భార్యాభర్తల వేధింపులు, గృహకలహాలు, శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిజాల అధారంగా పారదర్శకంగా దర్యాప్తు చేస్తామని, స్టేషన్లలో కేసు ఏ దశలో ఉందో బాధితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో నమ్మకం నింపుతూ, విచారణ ముగిసిన తక్షణమే తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికను అందజేస్తామన్నారు. చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


