జి.మాడుగుల: స్థానిక పీహెచ్‌సీలో శనివారం డీఎంహెచ్‌వో డాక్టర్ రియాజ్ బైగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో మందుల గది, ల్యాబ్ టెస్టింగ్ గదిని పరిశీలించారు. నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి? ల్యాబ్ టెస్ట్‌ల్లో ఎన్ని మలేరియా కేసులు నమోదయ్యాయి? తదితర వివరాలను పీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బందిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీ నిర్వహిణ రికార్డులను తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ కిశోర్, డాక్టర్ ఇందిర, సిబ్బంది పాల్గొన్నారు.


